మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Ayyappa Ashtottara Shatanama Stotram – శ్రీ అయ్యప్పాష్టోత్తరశతనామ స్తోత్రం


మహాశాస్తా మహాదేవో మహాదేవసుతోఽవ్యయః |
లోకకర్తా లోకభర్తా లోకహర్తా పరాత్పరః || 1 ||

త్రిలోకరక్షకో ధన్వీ తపస్వీ భూతసైనికః |
మంత్రవేదీ మహావేదీ మారుతో జగదీశ్వరః || 2 ||

లోకాధ్యక్షోఽగ్రణీః శ్రీమానప్రమేయపరాక్రమః |
సింహారూఢో గజారూఢో హయారూఢో మహేశ్వరః || 3 ||

నానాశస్త్రధరోఽనర్ఘో నానావిద్యావిశారదః |
నానారూపధరో వీరో నానాప్రాణినిషేవితః || 4 ||

భూతేశో భూతిదో భృత్యో భుజంగాభరణోత్తమః |
ఇక్షుధన్వీ పుష్పబాణో మహారూపో మహాప్రభుః || 5 ||

మాయాదేవీసుతో మాన్యో మహానీతో మహాగుణః |
మహాశైవో మహారుద్రో వైష్ణవో విష్ణుపూజకః || 6 ||

విఘ్నేశో వీరభద్రేశో భైరవో షణ్ముఖధ్రువః | [ప్రియః]
మేరుశృంగసమాసీనో మునిసంఘనిషేవితః || 7 ||

దేవో భద్రో జగన్నాథో గణనాథో గణేశ్వరః |
మహాయోగీ మహామాయీ మహాజ్ఞానీ మహాస్థిరః || 8 ||

దేవశాస్తా భూతశాస్తా భీమహాసపరాక్రమః |
నాగహారో నాగకేశో వ్యోమకేశః సనాతనః || 9 ||

సగుణో నిర్గుణో నిత్యో నిత్యతృప్తో నిరాశ్రయః |
లోకాశ్రయో గణాధీశశ్చతుష్షష్టికలామయః || 10 ||

ఋగ్యజుఃసామరూపీ చ మల్లకాసురభంజనః |
త్రిమూర్తిర్దైత్యమథనో ప్రకృతిః పురుషోత్తమః || 11 ||

కాలజ్ఞానీ మహాజ్ఞానీ కామదః కమలేక్షణః |
కల్పవృక్షో మహావృక్షో విద్యావృక్షో విభూతిదః || 12 ||

సంసారతాపవిచ్ఛేత్తా పశులోకభయంకరః |
రోగహంతా ప్రాణదాతా పరగర్వవిభంజనః || 13 ||

సర్వశాస్త్రార్థతత్వజ్ఞో నీతిమాన్ పాపభంజనః |
పుష్కలాపూర్ణసంయుక్తో పరమాత్మా సతాంగతిః || 14 ||

అనంతాదిత్యసంకాశః సుబ్రహ్మణ్యానుజో బలీ |
భక్తానుకంపీ దేవేశో భగవాన్ భక్తవత్సలః || 15 ||

ఇతి శ్రీ అయ్యప్ప అష్టోత్తరశతనామ స్తోత్రమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.